-
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటర్లకు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామంటోంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం. అయితే ఇది ఓటేసినందుకు కాదు.. మరి ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి..ఇండోర్ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుండి మే 8 వరకు ఓటరు స్లిప్‌లను ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టనుంది. నిర్ణీత వ్యవధిలోగా బీఎల్ఓలు ఓటరు స్లిప్‌ను అందిచకపోతే వాట్సాప్ లేదా టెలిఫోన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సింగ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఓటరు స్లిప్పులు అందని ఓటర్లు తమ అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వివరాలతో జిల్లా ఎన్నికల హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్ 9399338398 లేదా ల్యాండ్‌లైన్ నంబర్ 0731-2470104, 0731-2470105లో మే 10వ తేదీ వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నిజమైనదని తేలితే బీఎల్ఓపై చర్యలు తీసుకోవడంతోపాటు సరైన సమాచారం ఇచ్చిన ఓటర్లకు బహుమతిగా నగరంలోని సినిమా థియేటర్లో సినిమా చూసేందుకు రెండు సినిమా టిక్కెట్లను ఉచితంగా అందజేస్తారు. -
బెంగాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఓ మహిళా ఉద్యోగి లైంగిన వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. బెంగాల్ రాజ్‌భవన్‌లో పని చేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి.. గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గవర్నర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఆశచూపి గవర్నర్ తనపై పలుసార్లు లైంగికంగా వేధించారని సదరు మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. సదురు ఉద్యోగిని ఆరోపణలను గవర్నర్ ఆనంద బోస్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఆనంద్ బోస్ స్పందిస్తూ..‘ఇది దురుద్దేశంతో అల్లిన కట్టుకథ. ఇదంతా కల్పితమే. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలను కోరుకుంటే.. వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బెంగాల్లో హింస, అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని కామెంట్స్ చేశారు. “Truth shall triumph. I refuse to be cowed down by engineered narratives. If anybody wants some election benefits by maligning me, God Bless them. But they cannot stop my fight against corruption and violence in Bengal.”— Raj Bhavan Kolkata (@BengalGovernor) May 2, 2024 మరోవైపు.. ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బెంగాల్లో రెండు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇలాంటి నేపథ్యంలో గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బీజేపీకి షాకిచ్చినట్టు అయ్యింది. ఇక, ఈ వ్యవహారంపై అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం గవర్నర్‌పై మండిపడుతున్నారు. -
రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విస్ట్ ఇచ్చారు. అమేథీ నుంచి పోటీకి మొదటి నిరాసక్తి కనబరుస్తూ వస్తున్న ఆయన.. చివరకు రాయ్‌బరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. కాసేపటి కిందట కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మను బరిలో దించనుంది. సోనియా గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న టైంలో కేఎల్ శర్మ అన్ని వ్యవహరాలను చూసుకునేవారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడంతో.. సోనియా గాంధీ తనయ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దాదాపు దూరం అయ్యారనే చెప్పాలి.రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటే1952లో రాయ్ బరేలీ లోక్‌సభ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో జరిగిన ఎన్నికల్లోనూ ఫిరోజ్ గాంధీ(రాజీవ్ గాంధీ తండ్రి) ఎంపీగా నెగ్గారు. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత ఆయన సతీమణి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వరుసగా రెండు పర్యాయాలు నెగ్గారు. 1977లో జనతా పార్టీ తరఫున రాజ్ నారాయణ్ గెలుపొందారు. 1980లో మరోసారి కూడా ఆమె గెలిచారు. ఆ తర్వాత అరుణ్ నెహ్రూ, షీలా కౌల్ కాంగ్రెస్ తరఫునే చెరో రెండుసార్లు ఎంపీగా నెగ్గారు. 1996-98 టైంలో బీజేపీ అశోక్ సింగ్ ఎంపీగా గెలిచి కాంగ్రెస్ గెలుపు రికార్డుకు బ్రేకులు వేశారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 2004 నుంచి ఐదు పర్యాయాలు(2006 ఉప ఎన్నికతో సహా) సోనియా గాంధీ రాయ్‌బరేలీలో విజయం సాధిస్తూ వచ్చారు. ఇంకోవైపు ఈ రెండు లోక్‌సభ స్థానాల విషయంలో కాంగ్రెస్‌లో పెద్ద హైడ్రామానే నడిచింది. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ, రాయ్ బరేలీ ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో ఆయన దేని నుంచి పోటీ చేస్తారు?.. అసలు ఆయన ఈ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగింది.ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీలకు కాంగ్రెస్ కంచుకోటలుగా పేరుండేది. అమేథీలో రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. కానీ, 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అదే ఎన్నికలో కేరళ వయనాడ్ నుంచి కూడా పోటీ చేయడం, అక్కడ నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఇక ఈసారి కూడా ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే..క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోటీకి ఆయన దూరం జరిగారు. కేవలం వయనాడ్ నుంచి మాత్రమే ఆయన నామినేషన్ వేశారు. ఇదే అదనుగా.. పోటీ చేయడానికి రాహుల్ జంకుతున్నారంటూ బీజేపీ ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది. దీంతో బీజేపీ విమర్శలను సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. రాహుల్ పోటీ చేయాల్సిందేనని నిరసనలు చేపట్టేదాకా పరిస్థితి చేరుకుంది.మరోవైపు కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపారు. పోటీకి దూరంగా ఉండడం దేశం మొత్తం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని వివరించే యత్నం చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయించుకోవడంతో.. అక్కడి కాంగ్రెస్ అభ్యర్థిపైనా ఉత్కంఠ నెలకొంది. ఉప ఎన్నిక సహా ఐదుసార్లు ఆమె రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఆ స్థానంలో ఆమె తనయ, ఏఐసీసీ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయొచ్చనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి.ఈ రెండు స్థానాల అభ్యర్థిత్వం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అన్నాచెల్లెళ్లతో వరుసగా చర్చలు జరుపుతూ వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోటీకి ఒప్పించేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. అయితే గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. అమేథీ నుంచి కాకుండా రాయ్ బరేలీ నుంచి పోటీకి రాహుల్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాల నామినేషన్ల దాఖలుకు ఇవాళే ఆఖరు తేదీ. దీంతో భారీ ర్యాలీగా రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. ఐదో ఫేజ్‌లో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు మే 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
AP Election Updates May 3rd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 3rd May..'జగన్ కోసం సిద్ధం' ప్రారంభం8:30 AM, May 3rd, 2024తాడేపల్లి :రాష్ట్ర వ్యాప్తంగా 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభంఇంటింటికీ బూత్ స్థాయి కమిటీల విస్తృత ప్రచారంఐదేళ్లలో సీఎం జగన్ చేసిన మేలును మరోసారి ప్రజలకు వివరిస్తున్న పార్టీ శ్రేణులుపేదలే వైఎస్సార్సీపీ స్టార్ క్యాంపెయినర్లుఇప్పటికే 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసిన వైఎస్సార్‌సీపీవారితో కలిసి ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్తున్న పార్టీ బూత్ కమిటీలుపవన్‌కు పిచ్చి పీక్స్‌లో..7:45 AM, May 3rd, 2024పదవి వస్తుందో రాదో అని పవన్‌కళ్యాణ్ నిర్వేదంయువత గుండెల్లో నిప్పంటించడానికే వచ్చా..వైఎస్సార్సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి కూర్చోబెడతా‘నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడూ గుర్తుకురాడు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలువిశాఖ ఎన్నికల సభలో పవన్‌కళ్యాణ్ హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..7:25 AM, May 3rd, 2024హిందూపురంలో టీడీపీ నేతల దౌర్జన్యంవైఎస్ జగన్ పాటలు పెట్టారన్న కారణంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలుఆసుపత్రికి తరలింపుటీడీపీ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..7:10 AM, May 3rd, 2024మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సీఎం జగన్‌ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచార సభమధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రచార సభమధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు లోక్‌సభ స్థానంలోని కనిగిరిలో ప్రచారం. దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’ నోట్లే7:00 AM, May 3rd, 2024 కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో రూ.2 కోట్ల సీజ్‌తూ.గోదావరిలో దొరికిన కట్టల మూలాలూ టీడీపీలోనేలెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శిబాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లలో భారీగా నగదు పట్టివేతతిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠాబరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబుఏకంగా ఈ ఎన్నికల కోసం రూ.13 వేల కోట్లతో భారీ స్కెచ్‌అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు, ఎన్నారైల ద్వారా సమీకరణఅసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహంమార్గదర్శి, నారాయణ, టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్ర స్థాయికిఓటుకు రూ.5 వేలు ఇవ్వటానికైనా వెనకాడొద్దని నేతలకు హుకుంపంచాయతీ నేతకు రూ.50 లక్షలు.. మండల స్థాయి నేతకు రూ.కోటినియోజకవర్గస్థాయి నేత అయితే రూ.3 కోట్లు; దీనికోసం ప్రత్యేక టీమ్‌పోలీసుల సోదాల్లో దొరికిన ‘పచ్చ’కట్టలు జస్ట్ శాంపిల్ మాత్రమే మోసాల బాబు మరో అబద్ధం..6:50 AM, May 3rd, 2024ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు 2023–24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది ఇంటర్ విద్యార్థులు మరో 10,52,221 మంది.. ఈ ఒక్క పథకానికే ఏటా రూ.1,234 వేల కోట్లు అవసరం ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యమంటున్న నిపుణులు ఇక జీఓ–117 రద్దుచేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దుచేసేందుకు ఆస్కారం ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్6:40 AM, May 3rd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్‌లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు, అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికలకమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్‌కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి6:30 AM, May 3rd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి -
బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
హత్నూర(సంగారెడ్డి) /జిన్నారం (పటాన్చెరు): బీజేపీతో జోడి లేకపోతే ఈడీ కేసులు బనాయిస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్, గుమ్మడిదల, జిన్నారం మండలం బొల్లారం మునిసిపాలిటీలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రసంగిస్తూ బీజేపీతో తాము కలవకపోవడంతోనే ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసులు బనాయించి జైల్లో పెట్టారని, కేసులకు భయపడేది లేదన్నారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు నిధులు రాలేదని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడం కోసమే బీజేపీ ప్రయతి్నస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఏకంగా భార్యాభర్తలను విడదీసి ఓట్లు వేయించుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ అయిన బాండ్ పేపర్లాంటిదని, బాండ్ పేపర్ రిజెక్ట్ అయితే కేసులు ఎలా నమోదు చేస్తారో ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఏ ఒక్కరోజు పాల్గొనని రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. జై తెలంగాణ అన్న ఉద్యమకారులపై రైఫిల్ పట్టుకొని దాడి చేసిన రేవంత్‌రెడ్డికి ఈరోజు తెలంగాణ గుర్తుకొచి్చందా అని ప్రశ్నించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..
హీరామండిలో రిచా చద్దా లుక్స్.. ఫోటోలు
వైఎస్ఆర్ సీపీ కొత్త కార్యక్రమం 'జగన్ కోసం సిద్ధం'
Summer Special: వేసవిని తట్టుకునేలా.. కంఫర్ట్ & స్టైలిష్‌గా లాంగ్ ఫ్రాక్స్
భారత్‌పై జో బైడెన్ షాకింగ్ కామెంట్స్
కూటమికి బిగ్ షాక్
గరిష్ఠాలను చేరిన మార్కెట్ సూచీలు
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
'ప్రసన్నవదనం' బ్యూటీ చాలా ఘాటు గురూ.. రాశి సింగ్ (ఫొటోలు)
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్
- సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement